Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు, భారీ బడ్జెట్ చిత్రాల పరాజయాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధిస్తూ రూ. 400 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. హనుమాన్ భక్తుడైన ప్రసిద్ధ నీమ్ కరోలి బాబా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన 47వ రోజున కూడా దాదాపు రూ. 5 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 366 కోట్ల గ్రాస్, రూ. 200 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో మొదలై, ఫస్ట్ వీక్ ముగిసేసరికి రూ. 1.08 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కేవలం రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో రెండు వారాల మొత్తం కలెక్షన్ రూ. 1.48 కోట్లకు పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి ఊహించని విధంగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా పుంజుకున్నాయి. కాగా ఈ డిమాండ్ చూసి ఈ చిత్ర తెలుగు హక్కులను దర్శకుడు త్రివిక్రమ్ మొదట కొనుగోలు చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ‘హనుమాన్ అంశ్’ అసాధారణ విజయాన్ని పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఫలితంతో పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘టాక్సిక్’ చిత్రం మొత్తం రూ. 342 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా చివరికి రూ. 160 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది. రూ. 2 కోట్ల బడ్జెట్ సినిమా రూ. 200 కోట్ల షేర్ రాబడితే రూ. 450 కోట్ల సినిమా డిజాస్టర్‌గా మిగిలిందంటూ బాక్సాఫీస్ లెక్కలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Also Read
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!