ఐపీఎల్ 2021 లో దారుణంగా విఫలమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా అందులో ఒక్క విజయం మాత్రమే నమోదుచేసింది. దాంతో ఆ జట్టు పై అలాగే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మాజీ ఆటగాళ్లు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్ లో ఉన్న మరో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కు ఇవ్వాలని సూచించారు. అయితే చివరిగా ఆడిన మ్యాచ్ లో ఓటమి తర్వాత సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ మాట్లాడుతూ… ఆ ఓటమికి కారణంగానే తానేనని.. తన స్లో బ్యాటింగ్ కారణంగానే జట్టు ఓడిపోయిందని చెప్పాడు. ఇక ఈ జట్టు రేపు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడనుంది. కానీ దానికంటే ముందు వార్నర్ కు షాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ యాజమాన్యం. జట్టు కెప్టెన్ గా వార్నర్ ను తప్పిస్తూ… విలియమ్సన్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. రేపటి మ్యాచ్ తోనే విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని తెలిపింది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.