గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్,అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను సిజే సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చినట్టు గుర్తు చేసారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జజిఖాన్ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణములో లో సిజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా హైకోర్టు ప్రాంగణములో మొక్కలు నాటడం పట్ల న్యాయమూర్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొదటగా సిజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయమూర్తి కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి,జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ జి.శ్రీదేవి,జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు,జీపీలు జోగినిపల్లి సాయి కృష్ణ,సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు ,స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్,ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!