చంద్రునిపై త్వరలోనే మనిషి కాలుమోపబోతున్నారు. రాకెట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అంతరిక్షయానం సులువైంది. 2024 నుంచి చంద్రునిపైకి మనిషిని పంపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, చంద్రుడి మీద మనిషిని పంపించడమే కాకుండా, అక్కడ ఒకప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి తిరిగేందుకు అవసరమైన క్రూయిజ్ కార్లను సిద్దం చేస్తున్నట్టు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా ప్రకటించింది. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి సంయుక్తంగా ల్యూనార్ క్రూయిజ్ వాహనాన్ని తయారు చేస్తున్నది.
Read: రష్యా హెచ్చరిక: తాము యుద్ధానికి దిగం…కానీ…
ఈ వాహనం 2030 వరకు సిద్ధం అవుతుందని, 2040 వరకు మార్స్ మీదకు కూడా ఈ వాహనాన్ని తీసుకెళ్లవచ్చని టయోటా చెబుతున్నది. స్పేస్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తాము కూడా వాహనాలను తయారు చేస్తున్నామని టయోటా తెలియజేసింది. భూమిపై మాదిరిగానే చంద్రునిపై కూడా టయోటా వాహనాలు తప్పకుండా సేవలు అందిస్తాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.