హీరోయిన్ శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రియ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి తిరుమలను సందర్శించారు. పెళ్లయ్యాక ఈ జంట తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని, పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఈ జంట రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఈ జంటను ఆశీర్వదించారు.
Read Also : హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్
తరువాత ఆలయ అధికారులు ఈ జంటను పట్టు వస్త్రాలతో సత్కరించి ప్రసాదం అందించారు. ఈ జంట తిరుమలలో సందడి చేయడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా శ్రియ మీడియాతో మాట్లాడుతూ కరోనా వల్ల ఇటీవల కాలంలో శ్రీవారిని దర్శించుకోలేకపోయామని అన్నారు. ఇక తన భర్త మొదటిసారి తిరుమలను సందర్శించారని, దేవుడి దర్శనంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రియ “ఆర్ఆర్ఆర్”తో పాటు “గమనం” అనే సినిమాలో కూడా నటిస్తోంది.