Kia Carens Clavis: కియా ఇండియా తాజాగా విడుదల చేసిన కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ EV మోడళ్లకు భారతీయ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే ఈ రెండు మోడళ్ల కలిపి 21,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ సాధించాయి. ఇందులో 20,000+ బుకింగ్స్ ICE మోడల్‌కి, 1,000+ బుకింగ్స్ EV మోడల్‌కి లభించాయి. ఈ సందర్బంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జూన్సు చో మాట్లాడుతూ.. కేరెన్స్ క్లావిస్, క్లావిస్ EV మోడళ్లకు లభిస్తున్న అద్భుతమైన డిమాండ్, కస్టమర్లు కియా బ్రాండ్‌పై ఉంచుతున్న నమ్మకానికి నిదర్శనం అంటూ తెలిపారు. మేము ఎప్పుడు ఇన్నోవేషన్, భద్రత, సౌకర్యాన్ని మా వాహనాల్లో అందించడంలో కట్టుబడి ఉన్నామని అన్నారు. ICE, EV రెండు మోడళ్లు భారతీయ వినియోగదారుల మన్నన పొందటం, ఈ సెగ్మెంట్‌లో కియా లీడర్‌షిప్‌ని నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Tecno Spark Go 5G: కేవలం రూ.9,999లకే 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!
కేరెన్స్ క్లావిస్ ఆధునిక భారతీయ కుటుంబాల కోసం డిజైన్ చేయబడింది. SUV పవర్, MPV సౌకర్యం, ఫ్యామిలీ కార్ వెర్సటిలిటీ కలగలిపిన ఈ మోడల్ లాంగ్ రోడ్ ట్రిప్స్ తోపాటు సిటీ కమ్యూట్స్ రెండింటికీ అనువుగా ఉంటుంది. రెండో రో స్లైడింగ్, రీక్లైనింగ్, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ సీట్స్, సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటి ఫీచర్లని ఈ కారు అందిస్తుంది. అంతేకాకుండా 26.62 సెంటీమీటర్ల డ్యూయల్ పానోరమిక్ డిస్‌ప్లే, బోస్ 8-స్పీకర్ సిస్టమ్, 64-కలర్ అంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్‌క్యామ్, క్లైమేట్ కంట్రోల్ లేదా ఇన్ఫోటైన్‌మెంట్ స్వాప్ స్విచ్ వంటి ప్రీమియమ్ టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మరోవైపు, కేరెన్స్ క్లావిస్ EV కియా కంపెనీ మొదటి ‘మెడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ వాహనం. ఇది మంచి స్పేస్, స్మార్ట్ ఫీచర్లు, ఎఫోర్డబుల్ ధరలో డైలీ యూజ్‌కి సరిపోయే విధంగా రూపొందించబడింది. 171 PS మోటార్, 255 Nm టార్క్ సామర్థ్యం కలిగిన ఈ 7-సీటర్ EV, ICE మోడల్‌తో సమానమైన ప్రీమియమ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 67.62 సెంటీమీటర్ల డ్యూయల్ పానోరమిక్ డిస్‌ప్లే, 90 కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఇంకా సులభమైన కంట్రోల్స్ ఉన్నాయి.
ఇందులో 51.4 kWh (ARAI సర్టిఫైడ్ 490 km రేంజ్), 42 kWh (ARAI సర్టిఫైడ్ 404 km రేంజ్) బ్యాటరీ ఆప్షన్ వేరియంట్లు ఉన్నాయి. 100 kW DC ఛార్జర్ ద్వారా 10% నుంచి 80% వరకు కేవలం 39 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో సిటీ డ్రైవ్స్, లాంగ్ జర్నీలకు మంచి సౌకర్యం కలుగుతుంది. ఈ బుకింగ్స్ రికార్డ్‌తో కియా ఇండియా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, ప్రీమియమ్ అనుభవాలను అందించే బ్రాండ్‌గా తన స్థానం మరింత బలపరచుకుంది.
