ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.   ఆరో రోజైన నేడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  ఈరోజు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో సుమారు ల‌క్ష‌మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు, కుంకుమ‌ల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించ‌నున్నారు.  అమ్మ‌వారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ షోను సీఎం జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు క‌న‌క‌దుర్గ ఫ్లైఓవ‌ర్‌పై ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి.  

Read: చైనా హెచ్చ‌రిక‌: భార‌త్ అలా చేస్తే…

-Advertisement-ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌...

Related Articles

Latest Articles