కిలాడీ లేడీ… బాలుడిపై లైంగిక దాడి, రూ.16 లక్షల సొత్తు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి ఆశ్చర్యపోయింది.
Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న ధరలు
Also Read
అయితే ఆ బంగారాన్ని తండ్రి దగ్గర బంధువైన యువతికి ఇచ్చానని బాలుడు వెల్లడించాడు. సదరు యువతి తాను చదువుకునే పాఠశాలకు వచ్చి తనను ఓ లాడ్జీకి తీసుకువెళ్లిందని.. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడిందని వివరించాడు. ఆ సమయంలో మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసిందని.. ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 20 తులాల బంగారంతో పాటు రూ.లక్షల నగదు ఇచ్చానని బాలుడు తెలిపాడు. దీంతో ఈ విషయంపై బాలుడి తల్లి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువతిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరింది. కాగా మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా… పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?