Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు
- నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- కేంద్రానికి కీలక సూచనలు చేసిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిల్లలకు ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా వయసు ఆధారంగా ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇంటర్నెట్ను పొందడం, వినియోగించడం పిల్లలకు కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ అవసరమని పేర్కొంది. పిల్లల భద్రతను కాపాడుతూనే వారి హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలకు న్యాయస్థానం సూచించింది.
పిల్లల భద్రత, వారి స్వేచ్ఛ పరస్పర విరుద్ధమైన అంశాలు కావని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు ఇంటర్నెట్ ప్రాప్యతను పూర్తిగా నిరాకరించడం సమంజసం కాదని పేర్కొంది. భద్రత పేరుతో వారి ప్రాథమిక హక్కులను తొలగించకూడదని స్పష్టం చేసింది. వయసు ఆధారంగా కఠినమైన ఆంక్షలు విధిస్తే పిల్లలు నియంత్రణ లేని, మరింత ప్రమాదకరమైన వెబ్సైట్ల వైపు వెళ్లే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. ఆన్లైన్లో ఎవరైనా పిల్లలను ప్రలోభపెట్టినా, బెదిరించినా.. ఆంక్షలను ఉల్లంఘించామని తల్లిదండ్రులు శిక్షిస్తారనే భయంతో వారు జరిగిన విషయాన్ని చెప్పకపోవచ్చని అభిప్రాయపడింది. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ ఆన్లైన్లో కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులను రక్షించడంలో నియంత్రణ సంస్థలు, సోషల్ మీడియా వేదికలు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీడైరెక్ట్ లింకులు, వెబ్సైట్ల ద్వారా పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను చెల్లింపు ప్రమోషన్ల రూపంలో ప్రచారం చేస్తున్నారనే నివేదికలు కూడా ఈ విచారణకు కారణమయ్యాయి.
Also Read
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
- Women's Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
- Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
- Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
ప్రస్తుతం ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థ ప్రధానంగా వ్యక్తిగత ఫిర్యాదులపైనే ఆధారపడుతోందని కోర్టు పేర్కొంది. ఒక ప్లాట్ఫామ్లో కంటెంట్‌ను గుర్తించి తొలగించినా.. అదే కంటెంట్ ఇతర వేదికల్లోనూ ఉందని ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థ లేదని తెలిపింది. దీంతో కంటెంట్ తొలగింపులో జాప్యం జరిగి, అది మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. ఈ విషయంలో సమర్థమైన చర్యల కోసం అధికారులు, ప్లాట్‌ఫామ్‌లు మరింత కాలం తీసుకోవడాన్ని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది.
పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నెట్, సోషల్ మీడియా సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కంటెంట్‌కు సంబంధించిన పెర్సెప్చువల్ హ్యాష్‌లు, వెబ్ చిరునామాలతో కూడిన జాతీయ డేటాబేస్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనివల్ల ఒకే కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్‌లలో గుర్తించడం, సమన్వయంతో తొలగించడం సులభమవుతుందని పేర్కొంది.
పిల్లలకు ఆన్లైన్ ప్రమాదాలపై ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆన్లైన్లో ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులను గుర్తించడం, అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దల సహాయం కోరడం వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. పిల్లలపై ఆన్లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఆ పేరుతో వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్ వేగంగా తొలగించడంతో పాటు, తప్పుగా కంటెంట్ తొలగించే చర్యలను నివారించే వ్యవస్థలు కూడా ఉండాలని సూచించింది. పిల్లలకు ఇంటర్నెట్ను పూర్తిగా దూరం చేయడం కాకుండా.. దాన్ని సురక్షితంగా వినియోగించేలా అవగాహన కల్పించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, వారి హక్కులను కాపాడటం ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కోర్టు అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..