Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జకారియా తొలగింపు
- 5 రోజులకే పదవి నుంచి ఉద్వాసన
- ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉందని పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులై 5 రోజులైనా గడవక ముందే కేటీ జకారియా పదవి పోయింది. గత శుక్రవారమే కేటీ జకారియాను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించగా.. మంగళవారం తొలి ప్రెస్‌మీట నిర్వహించింది. ఇక తొలి ప్రెస్మీట్లో అనేత తడబాటులు ఎదురయ్యాయి. ఇక రిపోర్టర్ల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయింది. దీంతో మూణ్నాళ్ల ముచ్చటగా ఐదు రోజులకే పదవి పోయింది. ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి జకారియాను ట్రంప్ తొలగించారు.

Also Read
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
తాజాగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా కేటీ జకారియా స్పందించింది. “అధ్యక్షుడు ట్రంప్ దయగల, అద్భుతమైన, మర్యాదపూర్వకమైన, ఆలోచనాపరుడైన, ఉత్సాహవంతుడైన, కష్టపడి పనిచేసే వ్యక్తి. మరింత మంది అమెరికన్లు ఆయనను అభినందించాలని కోరుకుంటున్నాను. ఆయన అమెరికాను గొప్ప దేశంగా మార్చిన తీరు, ఇప్పటికీ కొనసాగిస్తున్న కృషి మరెవరూ చేయలేరు. ఆయన కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని కేటీ జకారియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. కేటీ జకారియాతో తనకు సుదీర్ఘంగా చర్చ జరిగిందని తెలిపారు. ఆమె ఈ పదవిలో కొనసాగాలా వద్దా అనే విషయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లు చెప్పారు. మీడియా ఆమెను అన్యాయంగా విమర్శిస్తోందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆమెతో నేను మాట్లాడాను. మీరు సంతోషంగా ఉండటమే మంచిదని చెప్పాను. నిజాయితీగా చెప్పాలంటే, నేను మీ స్థానంలో ఉంటే ఈ నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకునేవాడిని అన్నాను. మీరు ఆలోచించుకోండి.. కానీ మరోసారి పరిశీలించాలని సూచించాను” అని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం కొద్ది గంటల్లోనే కేటీ తన పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం గమనార్హం.
ఈ ఏడాది ఆగస్టులో కరోలిన్ లీవిట్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం కొత్త వ్యక్తి కోసం అన్వేషించింది. అక్టోబర్ 10న కేటీ జకారియాను ఆ పదవికి నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఆమె ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన ప్రకటన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కేటీ పనిచేశారని, ఆ ప్రాంతాల్లో విజయం సాధించడంలో ఆమె పాత్ర ఉందని అధ్యక్షుడు తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రెస్ సెక్రటరీగా ఆమె నిర్వహించిన తొలి మీడియా సమావేశమే వివాదానికి దారితీసింది. ట్రంప్‌కు అనుకూలంగా భావించే మీడియా సంస్థల ప్రతినిధులు సహా విలేకరుల నుంచి కేవలం మూడు ప్రశ్నలకే సమాధానమిచ్చి, 14 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో ఆమె మీడియా నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక కేటీ జకారియా న్యాయ విద్యార్హతలపైనా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పెప్పర్డైన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించిన ఆమె.. గతంలో సంప్రదాయవాద టెలివిజన్ ఛానళ్లలో వ్యాఖ్యాతగా పాల్గొన్నప్పుడు తనను తాను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నట్లు కథనం పేర్కొంది. చైనాలో న్యాయవాదిగా పనిచేశానని, న్యాయపరమైన విశ్లేషణలు అందించానని కూడా ఆమె గతంలో చెప్పినట్లు నివేదిక తెలిపింది. అయితే అమెరికాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి సంబంధిత బార్ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం. ఈ నేపథ్యంలో ఆమె అర్హతలపై ప్రశ్నలు తలెత్తాయి. గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని కేటీ అంగీకరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. “మీరు బార్ పరీక్ష రాశారు.. కానీ ఉత్తీర్ణత సాధించలేదు కదా?” అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, “అవును” అని ఆమె సమాధానమిచ్చారు. రెండోసారి కూడా పరీక్ష రాశారా అని అడిగినప్పుడు.. “లేదు” అని చెప్పారు. “ఆరేళ్లలో నాకు నలుగురు పిల్లలు పుట్టారు. న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలన్నది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు” అని ఆమె వివరించినట్లు కథనం వెల్లడించింది.
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జూన్‌లో చేరడానికి ముందు కేటీ జకారియా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో అధికార ప్రతినిధిగా పనిచేసినట్లు ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారని నివేదిక తెలిపింది. అప్పట్లో ఆ శాఖకు క్రిస్టీ నోయెమ్ కార్యదర్శిగా ఉన్నారు. అయితే కేటీ అక్కడ సుమారు రెండు నెలలకే విధుల నుంచి వైదొలిగినట్లు కథనం పేర్కొంది. ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆమె నిష్క్రమణ ప్రకటించడం, తొలి మీడియా సమావేశంపై విమర్శలు, న్యాయవిద్యార్హతలపై చర్చలు.. ఈ పరిణామాలన్నీ కలిసి అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
President Trump is a kind, wonderful, gracious, thoughtful, enthusiastic, and hardworking man. I wish more Americans appreciated him. No one will ever make America great the way he has and continues to.
It was an honor to work for him. https://t.co/Tp4NizrhE2
— Katie Zacharia (@KatieZacharia) October 17, 2026
తాజావార్తలు
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!