LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. అక్టోబర్ 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరలను వివిధ నగరాల్లో రూ. 62 నుంచి రూ. 72 వరకు పెంచినప్పటికీ, ఆ తర్వాత నుంచి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. చివరిసారిగా జూన్ నెలలో ప్రభుత్వం రూ. 29 వరకు పెంచింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే, జాతీయ రాజధాని అయిన డిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 942గా ఉండగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2810గా ఉంది. కోల్‌కతాలో గృహ వినియోగ సిలిండర్ రూ. 968కి, కమర్షియల్ సిలిండర్ రూ. 2954కి లభిస్తున్నాయి. ముంబైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 941.50గా, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2764.50గా ఉంది.
నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 950.50గా కొనసాగుతోంది. ఇక లక్నోలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 979.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2932.50గా ఉంది. అయితే బీహార్ రాజధాని పాట్నాలో మాత్రం గ్యాస్ ధరలు ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. పాట్నాలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1031.50గా ఉండగా, కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 3100.50కి చేరింది.
Also Read
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
మరోవైపు.. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా గతంలో భారత్‌కు ఎల్పీజీ దిగుమతుల విషయంలో కొంత సంక్షోభం తలెత్తింది. భారత్ తన అవసరాల కోసం సుమారు 90 శాతం బయటి దేశాల మీదే ఆధారపడుతుండటంతో, ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటేనే బుకింగ్ చేయడం, ఓటీపీ ఆధారంగా డెలివరీ అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల వినియోగాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.
తాజావార్తలు
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!