పటేల్ వర్గంవైపే బీజేపీ అధిష్టానం మొగ్గు… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈరోజు రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో పాటుగా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే తలంపుతో తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి అనగా పదవి నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తప్పుకోవడానికి పటేల్ వర్గం వ్యతిరేఖతే కారణమని తెలుస్తోంది. గుజరాత్లో పటేల్ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీకైనా సరే చాలా అవసరం. 2017లో జరిగిన ఎన్నికల సమయంలో పటేల్ వర్గం వ్యతిరేఖత కారణంగా బీజేపీ ఓటు బ్యాంకు పడిపోయింది. 99 సీట్లకు మాత్రమే పరిమితమయింది. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఉద్యమమే చేశారు. కాగా, గుజరాత్లో కొంత రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గం కాస్త శాంతించింది. అయినప్పటికీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా పటేల్ వర్గానికి దగ్గర కావాలని చూస్తుండటంతో బీజేపీ అధిష్టానం ముందుగానే మేల్కొని పటేల్ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్, వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫాల్దుతో పాటుగా కేంద్ర మంత్రులుగా ఉన్న మన్షుక్ మాండవీయ, పురుషోత్తం రూపాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నితిన్ పటేల్‌కు పదవీబాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నితిన్ పటేల్‌కు బాధ్యతలు అప్పగిస్తే పటేల్ వర్గీయులను ఏ మేరకు ఆయన ఆకర్షిస్తారో చూడాలి.
Read: యూపీలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్…పాదయాత్రకు సిద్ధం…
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?