India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారు. మ్యాచ్ ప్రారంభంలో అభిషేక్ 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్‌కు చుక్కులు చూయించాడు. చివర్లో తిలక్ వర్మ(51) బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఇక, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగారు. ఈ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. వైభవ్ 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. వైభవ్ అవుటయ్యే సమయానికి స్కోరు 28/1గా ఉంది. వైభవ్ తరువాత బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శామ్సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో అభిషేక్ శర్మ దుమ్మురేపేశాడు. 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, 61 పరుగుల వద్ద అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఆడిన అభిషేక్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217గా నమోదైంది. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ అతడిని స్టంప్ చేయడంతో అభి పెవిలియన్‌కు చేరాడు. ఇక బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అరఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు బాది.. 20 పరుగులు చేసి వెనుదిరిగాడు.
Also Read
- Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక ప్రకటనలు!
- Mitchell Santner: "చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం".. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
ఇక అప్పటి వరకు నిలకడగా ఆడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శ్రేయస్ 24 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ మధ్యలో టీమిండియా కాస్త తడబడింది. అభిషేక్ శర్మ అవుటైనప్పుడు, 7.5 ఓవర్లలో భారత జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులకు చేరింది. ఆ తర్వాత, 14.1 ఓవర్లలో శ్రేయస్ అవుటైనప్పుడు, టీమ్ ఇండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకు చేరింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే, తిలక్ వర్మ తరఫున వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడారు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో దూబే క్యాచ్ అవుట్ అయ్యాడు. దూబే 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఎట్టకేలకు 22 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసి టీమిండియాకి చేయూతనందించాడు.
తాజావార్తలు
-
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
-
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక ప్రకటనలు!
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..