వాట్సాప్ అదిరిపోయే ఆఫర్… రూ.1 పంపిస్తే.. రూ.51 క్యాష్ బ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది.
Read Also: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
Also Read
గీవ్ క్యాష్.. గెట్ రూ.51 పేరుతో ఈ ఆఫర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. రూ.1 పంపితే రూ.51 క్యాష్ బ్యాక్‌ను లింకు చేసిన బ్యాంక్ అకౌంట్‌ను పంపుతోంది. ఇలా ప్రతి యూజర్‌కు ఐదు లావాదేవీల వరకు క్యాష్ బ్యాక్ రానుంది. అంటే వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా ఐదు సార్లు రూ.1 చొప్పున రూ.5 పంపితే రూ.51 చొప్పున రూ.255 వరకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. త్వరలోనే ఆండ్రాయిడ్, ఆపిల్ యూజర్లకు వాట్సాప్ ప్రవేశపెట్టిన ఆఫర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ యాప్‌లో చాట్ బార్ కుడిపక్కన పేమెంట్స్ అనే కేటగిరి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను లింక్ చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వడం బాగా తగ్గించేసింది. క్యాష్ బ్యాక్ స్థానంలో డిస్కౌంట్ కూపన్లు ఇస్తోంది. వాటి ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!