తిరుమల తిరుపతి దేవస్థానం మూడో ఘాట్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈరోజు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మూడో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. పదకవితా పితామహుడిగా పేరుగాంచిన అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుతారు. Read:…