Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Weather Update Temperatures High In Ap And Telangana

తెలుగు రాష్ట్రాలకు ఊరట.. తగ్గిన చలి తీవ్రత

Published Date :December 27, 2021 , 8:39 am
By NTV WebDesk
తెలుగు రాష్ట్రాలకు ఊరట.. తగ్గిన చలి తీవ్రత
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో 12 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది.

తెలంగాణలో చలి తీవ్రత తగ్గిందనే చెప్పాలి. గత వారం రోజులుగా జనాన్ని వణికించిన చలి తగ్గి వేడి పెరుగుతోంది. దీంతో కూలీ పనులకు వెళ్లేవారికి, ఉద్యోగస్తులకు ఊరట లభించింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టింది చలి తీవ్రత. ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ లో 13.6 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. బజార్ హత్నూర్ లో 14 డిగ్రీలు. కొమురం భీం జిల్లా గిన్నె దరి 14.1 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో గతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యేవి. ఆరు నుంచి ఎనిమిది డిగ్రీలు నమోదయిన సందర్భాలున్నాయి. కానీ తాజాగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad
  • Andhra Pradesh
  • cold waves
  • lambasinghi
  • minimum temperatures

తాజావార్తలు

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..

  • Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా

  • SRK : ఆ హీరోయిన్ ను లక్కీ ఛామ్‌గా భావిస్తున్న కింగ్ ఖాన్

  • Hyderabad: అత్తాపూర్‌లో హైడ్రా ఉక్కుపాదం.. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions