గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర,…