న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ముంబై లో జరగనున్న రెండో టెస్ట్ కోసం జట్టులో చేరాడు. అయితే ఈ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన కోహ్లీ… ఈ టెస్ట్ తర్వాత భారత జట్టు వెళాల్సిన సౌత్ ఆఫ్రికా పర్యటన గురించి స్పందించాడు. ఈ పర్యటన విషయంలో మా జట్టు మొత్తం నిరంతరం బీసీసీఐ తో టచ్ లోనే ఉన్నామని చెప్పాడు. త్వరలో ఏం జరుగుతుందో మాకు స్పష్టత వస్తుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా దీనిపై చర్చలు జరుపుతున్నారు అని పేర్కొన్నారు.
అయితే సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ మరింత విజృంభించకపోతే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారమే సాగుతుంది అని ఇంతకముందే బీసీసీఐ చెప్పింది. అయితే కివీస్ తో ఈ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళాల్సిన భారత జట్టు డిసెంబర్ 17 నుండి జనవరి 26 వరకు ఆ కట్టుతో 3 టెస్టులు, 3 వన్డేలు. 4 టీ20 మ్యాచ్ లు ఆడాలి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ పర్యటనను ఒక్క వరం వాయిదా వేయాలని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరినట్లు తెలుస్తుంది.