ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాలపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఈ దాడి కాస్త క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో పాకిస్థాన్ లోని సాధారణ ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. చాలా మంది పాక్ అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని పలు మీడియా…
దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్‌డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి.
America : అమెరికాలో కొంతకాలంగా మంటలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మంటలు పెరుగుతున్నాయి.. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించబడ్డారు.
ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు విద్యార్ధులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా విద్యార్ధులను ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తరలించారు. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు కేంద్రం ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాలకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తున్నది. ఒక్కో విమానం ఇండియా నుంచి వెళ్లి అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొని ఇండియాకు రావడానికి సుమారు రూ.…
తాలిబన్లు విధించిన డెడ్‌లైన్ మరో 48 గంటల్లో ముగియనున్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉన్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి తరువాత తాలిబన్లు కాబూల్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆగస్టు 31 తరువాత కూడా తరలింపుకు అవకాశం ఇవ్వాలని అమెరికాతో సహా ఇతర దేశాలు తాలిబన్లను విజ్ఞప్తి చేసిప్పటికీ వారు…
బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి…
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం.…