ఆగస్టు 31 వ తేదీ కంటే ముందే అమెరికా దళాలు ఆఫ్ఘన్‌ను వదిలి వెళ్లిపోయాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో చివరి సైనికుడితో సహా అందర్ని అమెరికా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వెళ్లే సమయంలో వీలైన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్‌లోనే వదిలేసింది. అయితే, వాటిని చాలా వరకు నిర్వీర్యం చేసింది. తిరిగి వినియోగించాలంటే దానికి తగిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ వ్యవస్థ అవసరం. అమెరికా నిపుణులు తప్పించి మరోకరు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురాలేకుండా వాటిని మార్చేసింది. అమెరికా వదిలి వెళ్లిపోయిన వాహనాల్లో చాలా వరకు తుక్కుగా మారిపోయాయి. తప్పించి వినియోగించేందుకు ఎందుకు పనికిరావు. ఇలా తుక్కుగా మార్చిన వాటిల్లో విమానాలు, హెలీకాఫ్టర్లు, మందుపాతరలను తట్టుకోగల ఎంఆర్ఏపీ సాయుథ శకటాలు, హామ్వీ రవాణా వాహనాలు, రాడార్ సీ రామ్ వ్యవస్థ వంటి వాటిని అమెరికా సైనికులు నిర్వీర్యం చేశారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలంతే తాలిబన్లకు కుదరని పని.
Read: కరోనా నిబంధనలు పాటించని పాఠశాల బస్సులు సీజ్…