కరోనా నిబంధనలు పాటించని పాఠశాల బస్సులు సీజ్…

రాజేంద్రనగర్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తం 12 పాఠశాలల బస్సులు సీజ్ చేసారు. కరోనా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సుల పై కొరడా ఝులిపించారు రవాణా శాఖ అధికారులు. అయితే కరోనా కారణంగా ఇన్ని రోజులు బంద్ ఉన్న పాఠశాలలు ఈ రోజు నుండి ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు రవాణా శాఖ. రంగారెడ్డి జిల్లా ఉపరవాణా అధికారి ప్రవీణ్ రావు ఆదేశాల‌ మేరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేసింది అధికారుల బృందం. బస్సులకు సంబంధించి పత్రాలను పరిశీలించిన అధికారులు… ఫిట్‌నెస్, పర్మిట్, ట్యాక్స్ లు లేకుండా రోడ్డు పై తిరుగుతున్న వాటిపై కఠినంగా వ్యవహరించారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-