టిప్పు సుల్తాన్ సింహాసనం వేలం.. మండిపడుతోన్న భారత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.. 18వ శతాబ్దంలో భారత్‌లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా బ్రిటన్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు..
Read Also: నవంబర్ 17, బుధవారం దినఫలాలు…
Also Read
ఇక, టిప్పు సుల్తాన్ సింహాసనం విషయానికి వస్తే.. కిరీటం ఆభరణం అని కూడా పిలువబడే ఫినియల్ ఎనిమిది బంగారు పులి తలలలో ఒకటి, ఇది పాలకుడి సింహాసనాన్ని అలంకరించింది ఉంటుంది.. దీనిని “మైసూర్ టైగర్” అని కూడా పిలుస్తారు. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్ దీని ఎగుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.. యూకే డిజిటల్, కల్చర్, మీడియా మరియు స్పోర్ట్ డిపార్ట్‌మెంట్, “£1.5 మిలియన్లకు వేలం పెట్టడంతో.. ఇది యూకే నుంచి నిష్క్రమించే అవకాశం లేకపోలేదు. కానీ, ఒక సంస్థ లేదా వ్యక్తి.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని కొనుగోలు చేయడానికి, దానిని ఎగుమతికి అనుమతించడంపై నిషేధం విధించింది. కాగా, బంగారంతో తయారు చేయబడిన ఈ సింహాసనంలో కెంపులు, పచ్చలు మరియు వజ్రాలు అమర్చారు.. 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల కళా నైపుణ్యాన్ని ఇది సూచిస్తోంది.. ఇక, టిప్పు సుల్తాన్ 1799లో ఓడిపోయి మరణించే వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అతిపెద్ద ముప్పుగా పరిగణించబడ్డాడు. అయితే, యూకేపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు నెటిజన్లు.. భారత్ నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను బహిరంగంగా వేలం వేయడమే కాదు.. ఇక భారత్‌కు చెందిన వ్యక్తులు దానిని కొనుగోలు చేసి తరలించకుండా కూడా ఎగుమతిపై నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!