Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- కోల్‌కతాలోని చోర్‌బాగన్ దుర్గా పూజ పండల్ వద్ద తొక్కిసలాట
- ఈ ఘటనలో కనీసం 17 మంది మృతి చెందినట్లు సమాచారం పలువురికి గాయాలు.. ఆసుపత్రులకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: పండగ వేళ పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగన్ సార్వజనిన్ దుర్గా పూజ పండల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న సీఎం సువేందు అధికారి, రాష్ట్ర సీఎస్ మనోజ్ అగర్వాల్ పరిస్థితిని సమీక్షించేందుకు కలకత్తా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఘటన సమయంలో మండపం వద్ద ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మందిని బైకులపై ఆస్పత్రులకు తరలించారు. మండపంలోకి ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు చాలా ఇరుకుగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Also Read
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
#WATCH | North Kolkata, West Bengal | A stampede-like situation was reported at the Chorbagan Sarbojanin Puja pandal. The injured were shifted to the hospital. More details awaited. https://t.co/EZm78mo5mN
— ANI (@ANI) October 17, 2026
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!