అమెరికా తరువాత ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నది. ఇక, అమెరికాను అన్ని విధాల అడ్డుకునేందుకు కూడా చైనా ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని పసిగట్టిన అమెరికా కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. చైనా నుంచి అమెరికా స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్టింగ్ అయిన కంపెనీలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం చైనా కంపెనీలు వారి ఆడిట్ రిపోర్టులలో కొంత అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
Read: 50 ఏళ్ళ క్రితం పోగొట్టుకున్న ఆ ఉంగరం… ఇప్పుడు ఇలా దొరికింది…
చైనా లిస్టింగ్ కంపెనీల వార్షిక ఆడిట్ రిపోర్టులను అమెరికా పబ్లిక్ కంపెనీస్ అకౌంటింగ్ ఓవర్సైట్ బోర్డు సమీక్షించేందుకు అనుమతులు ఇవ్వాలి. కంపెనీల్లో చైనా ప్రభుత్వానికి వాటాలున్నాయా లేదా, చైనా కమ్యునిస్ట్ పార్టీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాలను రిపోర్టులో బహిర్గతం చేయాలి. అమెరికా నిబంధనలకు ఒప్పుకోకుంటే ఆ కంపెనీలు స్టాక్ ఎక్బేంజ్ నుంచి డీలిస్ట్ అవుతాయనే నిబంధనలు తీసుకొచ్చిది. అమెరికా కొత్త నిబంధనలతో సుమారు 200 కంపెనీలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే అమెరికా చైనా దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది.