కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.…