ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్‌గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు. ఆ తరువాత రైలు సొరంగంలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన రైలు అవతలి మార్గం నుంచి బయటకు రాలేదు. ఒకవేళ ప్రమాదం జరిగింది అనుకుంటే లోపల ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కనిపించాలి. అలాంటివి ఏవీ అక్కడ కనిపించలేదు. రైలులో ఉన్న 104 మంది ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియలేదు. ఆ రైలు కోసం, రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల కోసం ఇటలీ ప్రభుత్వం అప్పట్లో చాలా ప్రయత్నాలు చేసింది. రైలు పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎటు వెళ్లి ఉంటుంది అన్నది అర్థంగాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు.
Read: కరెంట్, నీరు లేని ఆ ఇంటి ఖరీదు ఐదు కోట్లా…!!