మధురానికి మారు పేరు మహ్మద్ రఫీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం.
యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది. ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది. రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది. తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం.
పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే ఊరిలో మహ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న జన్మించారు. బాల్యంలో తమ ఊరిలో ఫకీర్లు తిరుగుతూ పాడే పాటలను వల్లిస్తూ ఉండేవారు రఫి. 1935లో ఆయన తండ్రి అలీ మొహమ్మద్ లాహోర్ కు మకాం మార్చారు. అక్కడే చిన్నారి రఫీలోని అసలైన గాయకుడు బయటపడ్డాడు. ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద సాధన చేశాడు. నాటి మేటి గాయకుడు కె.ఎల్.సైగల్ ను అనుకరిస్తూ పాటలు పాడేవారు రఫి. సైగల్ సూచనలతో కొన్ని మెలకువలు తెలుసుకొని ముందుకు సాగారు రఫి. 1945లో రూపొందిన ‘గావోంకీ గోరీ’ చిత్రంలో రఫీ తొలిసారి పాడారు. ఆయనలోని అసలైన గాయకుణ్ణి లోకానికి పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకులు నౌషాద్ కే దక్కుతుంది. నౌషాద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ-బావ్రా’తో రాత్రికి రాత్రి మహ్మద్ రఫీ గాయకుల్లో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. నాటి నుంచీ హిందీ చిత్రసీమలో మహ్మద్ రఫీ గానం జైత్రయాత్ర చేసింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తెలుగువారికి మహ్మద్ రఫీ పేరు వినిపించగానే చప్పున నటరత్న యన్టీఆర్ కు ఆయన పాడిన సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగులో మహ్మద్ రఫీతో తొలిసారి పాట పాడించినది నటనిర్మాత జగ్గయ్య. ఆయన సమర్పణలో తెరకెక్కిన ‘పదండి ముందుకు’లో “మంచికి కాలం తీరిందా…” అనే పాటను రఫీ పాడారు. ఇదే రఫీ పాడిన తొలి తెలుగు పాట. ఆ తరువాత చిత్తూరు నాగయ్య తన ‘భక్త రామదాసు’లో కబీర్ పాత్ర ధారి అయిన గుమ్మడికి రఫీతోనే హిందీ పాట పాడించడం విశేషం. ఈ సినిమాల తరువాత యన్టీఆర్ ‘భలే తమ్ముడు’లో రఫీ తెలుగు పాటలు పాడి జనాన్ని పరవశింప చేశారు. హిందీ ‘చీనా టౌన్’ ఆధారంగానే ‘భలే తమ్ముడు’ రూపొందింది. అక్కడ కూడా రఫీ పాటలే చిత్రానికి ప్రాణం పోశాయి. దాంతో తెలుగులోనూ రఫీతోనే పాడించారు నిర్మాత పుండరీకాక్షయ్య. ‘భలే తమ్ముడు’తోనే తెలుగునాట రఫీ పాట పరవళ్ళు తొక్కిందని చెప్పాలి. ఇందులో రఫీ గళంలో జాలువారిన “ఎంతవారు గానీ వేదాంతులైన గానీ…”, “ఇద్దరి మనసులు ఒకటాయె…”, “నేడే ఈ నాడే మురిపించె నన్ను చెలితానే..”, “గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా…”, “బడా దిల్ వాలా హూ మై…” అనే ఖవ్వాలీ ఎంతగానో అలరించాయి.
తరువాత తెలుగులో యన్టీఆర్ తో అనుబంధం ఉన్న చిత్రాలలోనే రఫీ పాటలు పాడడం విశేషం. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా పెళ్ళామా’లో “నువ్వు నవ్వుతున్నావు…నేను నవ్వుతున్నాను…” అనే ఖవ్వాలీ సాంగ్ పాడించారు. తరువాత యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ నటించిన “రామ్ – రహీమ్”లో హరికృష్ణకు నేపథ్యం పాడారు రఫి. అందులోని “యూనానీ హకీమ్ హూ…”, “నేను కత్తుల రత్తయ్యనులే…” పాటలు పాడారు. తరువాత యన్టీఆర్ తో పుండరీకాక్షయ్య నిర్మించిన ‘ఆరాధన’ చిత్రంలో మరోమారు రామారావుకు రఫీ నేపథ్యగానం చేసి మురిపించారు. ఇందులోని “ప్రియతమా… నా మది నిన్ను పిలిచింది…”, “నేడే తెలిసింది… ఈ నాడే తెలిసింది…”, “నీకేల ఇంత నిరాశ…” పాటలు పాడి ఎంతగానో అలరించారు. ఆపై యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’లో సలీమ్ పాత్రధారి బాలకృష్ణకు అన్ని పాటలూ రఫీతోనే పాడించారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “తారలెంతగా మురిసేనో…”, “తానే మేలి ముసుగు తీసి…”, “హసీనా… ఓ హసీనా…”, “రేయి ఆగిపోనీ…రేపూ ఆగిపోనీ..” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో సత్యనారాయణ పాత్రకోసం “దేవుడు ఒకడే ఆ దైవం ఒకడే…” పాటను పాడారు రఫీ. ఇదే ఆయన చివరగా పాడిన తెలుగు పాట. ఏది ఏమైనా మహ్మద్ రఫీ గళంలో జాలువారిన గానానికి తెలుగువారు ఎంతగానో పులకించిపోయారు. ఆయన పాడిన తెలుగు పాటలనే కాదు, హిందీ గీతాలనూ అదే స్థాయిలో అభిమానించి, ఆరాధించారు జనం.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!