మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం.యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది. ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది. రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది. తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే ఊరిలో మహ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న జన్మించారు. బాల్యంలో తమ ఊరిలో ఫకీర్లు తిరుగుతూ పాడే పాటలను వల్లిస్తూ ఉండేవారు…