తెలుగు సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్.. ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాను చేస్తున్నాడు.. చాలా కాలం నుంచి రవితేజకు ప్లాప్ లే పలకరిస్తున్నాయి.. ఇక తాజాగా రవితేజ నటించిన భారీ బడ్జెట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న (శుక్రవారం) పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైంది..1980 దశకానికి చెందిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించింది. ఈరోజు విడుదలైన ఈ ఫిక్షనల్ బయోపిక్ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో.. పబ్లిక్ రెస్పాన్స్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
ప్రజలను గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ జీవించాడని ఓవర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. రాబిన్ హుడ్ క్యారెక్టర్‌లో రవితేజ తన యాక్టింగ్‌తో రఫ్పాడించాడని అంటున్నారు. అతడి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫామెన్స్‌గా ఈ మూవీ నిలిచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అతడి ఎంట్రీ, స్క్రీన్ ప్రజెన్స్, ఎలివేషన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయాని అంటున్నారు..
ఇకపోతే ఈ సినిమాలోని ప్లస్ లను చూస్తే.. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు టైగర్ నాగేశ్వరరావు సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు. 1980 కాలాన్ని అద్భుతంగా సినిమాలో రీక్రియేట్ చేశారని అంటున్నారు. ఫన్, ఎలివేషన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.. యాక్టర్స్ వారి పాత్రకు న్యాయం చేశారు.. ఎవరికి వారే అంటే అన్నట్లువిజ్రంబించారు.. ఎక్కడ బోర్ కొట్టలేదు..
ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. సినిమాకు మైనస్‌గా నిలిచిందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు. సెకండాఫ్‌ను డైరెక్టర్ సీన్స్ ను కాస్త సాగదీశారని, మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ సరిగా వర్కవుట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూడు గంటలకుపైగా ఉన్న నిడివి కూడా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు ముఖ్యంగా పాటలు, బీజీఎమ్ . టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పెద్ద డ్రా బ్యాక్ చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ విషయంలో క్వాలిటీ మిస్సయిందని అంటున్నారు.. మొత్తానికి సెకండ్ ఆఫ్ లో జనాలు బోర్ గా ఫీల్ అయ్యారని టాక్.. అక్కడక్కడా లోపాలు ఉన్నా కూడా మంచి పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఆడియెన్స్‌ను ఈ సినిమా అలరిస్తుందని చెబుతోన్నారు. రవితేజ అభిమానులను పూర్తిగా ఈ సినిమా సంతృప్తిని పరుస్తుందని ఓవర్ సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.. మొత్తానికి రవితేజ ఖాతాలో హిట్ పడినట్లే ఉంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
#TigerNageswaraRao Good 1st Half!
Apart from the VFX, so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a very dark character which is unique to watch.
— Venky Reviews (@venkyreviews) October 19, 2023
So here’s the full review
Story and screenplay is good.
Bgm aithe Ramp at times we feel silent but fights apudu Peaks💥💥💥@RaviTeja_offl anna acting aithe One of the BEST🤌🔥
Fights💥💥💥
Songs are big let down lag anipinchindi una 3 songs
3⭐ 💥💥 HIT bomma#TigerNageswaraRao— Krishna🇮🇳🇬🇧 (@SaiKrishnaJSPK) October 19, 2023