అర్ధరాత్రి ఆర్టీసీకి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే స్పందించిన సజ్జనార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్‌ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్‌ఆర్టీసీ, ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్‌లలో 10 నిమిషాలు ఆపాలని పాలే నిషా అనే యువతి ట్విట్టర్ వేదికగా కోరింది.

దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని యువతి తెలిపింది. దీంతో వెంటనే ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ రిప్లై ఇచ్చారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపింది. నిషాతో పాటు నెటిజన్లు సైతం సజ్జనార్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!