ఎలన్ మస్క్ నిత్యం ఏదోక విషయంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు. టెస్లా కంపెనీలో తన షేర్ల విషయంలో ఇటీవలే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నది. కంపెనీలో తన షేర్లను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. నెటిజన్ల అభిప్రాయం కోరాడు. అనంతరం టెస్లాలో తనకు సంబంధించిన కొన్ని షేర్లను అమ్మేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి.
Read: రాహుల్ గాంధీకీలక వ్యాఖ్యలు… ఏం మారలేదు… కానీ…
షేర్ల విషయంలో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై విచారణ చేపట్టాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇన్వెస్టర్లు. టెస్లా షేర్ ధరలు తగ్గించే విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్ టెస్లా కంపెనీపైనా, ఎలన్ మస్క్‌పైనా అమెరికా సెక్యూరిటీ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశాడు. మస్క్ ట్వీట్ తో పాటు టెస్లా బోర్డు సభ్యుల విశ్వసనీయతపై కూడా డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో పిటిషన్ దాఖలు చేశారు.