కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీపై హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకు వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది.
టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్‌ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్‌ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్‌పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు..…
ట్విట్టర్ సోషల్ మీడియా వాడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. వ్యక్తులు, సంస్థలు, రాజకీయపార్టీలు తమ ప్రచారం కోసం ట్విట్టర్ ను విరివిగా వాడతారు. సెలబ్రిటీలయితే లక్షలాదిమంది అభిమానులకు ట్విట్టర్ ద్వారా చేరువ అవుతారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. త్వరలో తీసుకురాబోయే ఫీచర్ ద్వారా అక్షరాల పరిమితి వుండబోదు. ఈ ఫీచర్ సాయంతో ఎంత పెద్ద వ్యాసాన్నయినా ట్విట్టర్ లో పోస్టు చేసే అవకాశం కలుగుతుంది. మొదట్లో ట్విట్టర్ లో ఒక…
ఎలన్ మస్క్ నిత్యం ఏదోక విషయంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు. టెస్లా కంపెనీలో తన షేర్ల విషయంలో ఇటీవలే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నది. కంపెనీలో తన షేర్లను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. నెటిజన్ల అభిప్రాయం కోరాడు. అనంతరం టెస్లాలో తనకు సంబంధించిన కొన్ని షేర్లను అమ్మేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి. Read: రాహుల్ గాంధీకీలక వ్యాఖ్యలు… ఏం మారలేదు……
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే…