ఏపీ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ, పెండింగ్ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. ఉద్యోగ సంఘాలతో సమావేశమై డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు.. రెండు జేఏసీల ప్రతినిధుల బృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో చర్చలు సాగాయి.. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.
Read Also: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
అయితే, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లు వెంటనే పరిష్కారం అయ్యేవి కావని, అవి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాలకు వివరించారు మంత్రి బుగ్గన.. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, అది కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఇక, దీనికి సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలు.. డిమాండ్లను సాధించుకోవడానికి ఆందోళన చేస్తున్నామని.. క్రమంగా అన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చేయాల్సిన అవసరం లేదని.. దీంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని ప్రకటించాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నాం.. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ఉద్యోగ సంఘాల 71 అంశాలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి సీఎస్ అన్ని విభాగాల సెక్రటరీలతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక, మంచి వాతావరణంలో చర్చల ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు కూడా భాగమే. రెండు జేఏసీల్లోని 9 సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని కోరామని.. వారు కూడా అంగీకరించారని వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!