పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే ‘వినాయక చవితి’గా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాల నిర్మాణాలు పూర్తి కాగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. గణేష్ విగ్రహాల కొనుగోలు సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈరోజు ఉదయం పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.…
Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.…
One Ganesh statue in Keshavapuram Village For The Past 40 Years: ‘వినాయక చవితి’ వచ్చిందంటే.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. నవరాత్రుల సందర్బంగా పట్టణాల్లో గల్లీకో వినాకుడి విగ్రహంను పెడుతారు. అదే ఊర్లో అయితే వాడకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కన తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గల్లిగల్లీకి, వాడకో వినాకుడి విగ్రహంను పెడుతున్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే…
ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్…
వినాయక చవితి వచ్చింది అంటే వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరుతారు. ఒక మండపంలో ఉండే గణేషుని విగ్రహ రూపం ఒకలా ఉంటే మరోక చోట మరో రూపంతో విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తన పాదాల కింద అణగదొక్కుతున్న రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు. అయితే, పంజాబ్‌లోని లూథియానాలోని గణపతి ఇప్పుడు అందర్ని అకట్టుకుంటున్నాడు. ఆ గణపతిని తయారు చేయడానికి 200 కిలోల డార్క్ చాక్లెట్‌ను వినియోగించారు. ఈ డార్క్ చాక్లెట్…