వైర‌ల్‌: ఆ ముస‌లాయ‌న స్కైటింగ్ స్కిల్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే…

స్కేటింగ్ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా జాగ్ర‌త్తగా ఆడాల్సిన గేమ్‌.  ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా కాళ్లు చేతులు విరిగిపోతాయి.  చిన్న‌పిల్ల‌లు, యువ‌త ఎక్కువ‌గా ఈ గేమ్‌ను అడుతుంటారు.  అయితే, రష్యాకు చెందిన 73 ఏళ్ల ఇగోర్ అనే పెద్ద‌మ‌నిషి స్కేటింగ్ లో త‌న స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించి భ‌ళా అనిపించాడు.  73 ఏళ్ల వ‌య‌సులో కూడా ఎలాంటి భ‌యం, బెరుకూ లేకుండా ఇగోర్ త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాడు.  దీనికి సంబందించిన వీడియో ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న‌ది.  ప్ర‌తిభ‌కు వ‌య‌సుతో ప‌నిలేద‌ని, ప్ర‌ద‌ర్శించాల‌నే త‌ప‌న ఉంటే స‌రిపోతుంద‌ని చెబుతున్నాడు ఇగోర్‌.   ఆయ‌న ప్ర‌తిభ‌ను చూసి యువ‌త నైతం ముక్కున వేలేసుకుంటోంది.  

Read: భూమికి ద‌గ్గ‌ర‌గా ఏలియ‌న్లు… మిస్ట‌రీగా మారిన ఆ శాటిలైట్‌…

Related Articles

Latest Articles

-Advertisement-