Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ ఈసినిమా మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు యష్. అందులో భాగంగా బాలీవుడ్ లో చేసిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నిస్తూ.. “రామ్ చరణ్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దక్షణాది నటులు మీలాగా పాన్ ఇండియా సూపర్‌స్టార్స్‌గా ఎందుకు ఎదగలేకపోయారు? దానికి గల కారణాలు ఏంటి?” అని అడగగా యశ్ దానికి కాస్త హుందాగా సమాధానమిచ్చారు.
యశ్ స్పందిస్తూ.. “వారందరూ తమ పరిధిలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతీ నటుడికి, ప్రతీ సినిమాకి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. పైగా ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ ఎవరికీ శాశ్వతం కాదు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, చిత్రపరిశ్రమలో విజయాలు, హోదాలు సమయాన్ని బట్టి మారుతుంటాయని, కేవలం ప్రాజెక్ట్ సాధించే విజయాన్ని బట్టే ఆ సమయానికి గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్డమ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని అందరూ కలసి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. తోటి కథానాయకుల శ్రమను, వారికున్న ప్రజాదరణను గౌరవిస్తూ యశ్ ఇచ్చిన ఈ సమాధానంపై నెటిజన్లు మరియు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న టాక్సిక్ తో యశ్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!