తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో ఏపీ కావాలనే దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ను గుర్తించడం లేదని పర్యావరణ అనుమతులు ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్రమమే అని పేర్కొన్నారు. జులై 9న నిర్వహించబోయే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని… జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేశారు.

read also : మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలు ఎజెండాగా చేర్చాలని… కృష్ణా బోర్డు సమావేశంలో మా వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు లో నీటి లభ్యత ఉన్నంతకాలం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని హక్కు కృష్ణా బోర్డు లేదు అని చెప్పిన సీఎం కేసీఆర్… జల విద్యుత్ కు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని వెల్లడించారు.

‘‘ తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోరు మోటార్లున్నాయి. తెలంగాణ మొత్తం విద్యుత్తులో 40శాతం విద్యుత్తు సాగునీటి అవసరాలకే వినియోగించబడుతున్నది. తెలంగాణకున్న భూపరిస్థితుల (terrain) దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరం..’ అని ముఖ్యమంత్రి వివరించారు. “ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరు’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

-Advertisement-తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్

Related Articles

Latest Articles