టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకున్న కోహ్లీ తాజాగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గాడు. దీంతో…