ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లిన విషం తెలిసిందే.. అయితే, అది ఒరిజినల్ కాదు.. ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.. కానీ, ఇప్పుడు మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టింది టీడీపీ.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను…
ఏపీలో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిలు కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్‌కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. Read Also : యూపీలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక…
ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. పట్టాభి అరెస్టుకు సంబంధించి పోలీసులు సరైన విధానం పాటించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుకు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని కోర్టు నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం…
సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాభి తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని… ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అనేకసార్లు దాడి చేశారని…
ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్…
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు…