దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డ్ సాధించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ ప్రకటించిన టాప్ 500 కంపెనీల్లో టాటా కన్సల్టెన్నీ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,78,357 మంది ఉన్నారు. మొత్తం టీసీఎస్ ఉద్యోగుల్లో 35 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Read: ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ క్లారిటీ…
పదేళ్ల కిందట టీసీఎస్ లో మహిళల ఉద్యోగులు 30 శాతం వరకు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 35 శాతానికి పెరిగింది. ఐటీరంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు కారణంగానే ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు సదరు సంస్థ స్పష్టం చేసింది. టాటా బాటలో ఇన్ఫోసిస్ నడుస్తున్నది. టాటా తరువాత ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా, ఇందులో 1,00,321 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.