మహిళలకు కర్ణాటక ప్రభుత్వం దీపావళి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నెలలో ఒకరోజు రుతుక్రమ సెలవును ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వర్తిస్తుందని పేర్కొంది.
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వివాహిత మహిళలకు ఇచ్చే మెటర్నిటీ లివ్ (ప్రసూతి సెలవులు)లను చంద్రబాబు సర్కార్ పొడగించింది. మెటర్నిటీ లివ్‌లను 120 నుంచి 180కి పెంచింది. అంతేకాదు ఇద్దరు పిల్లకు మాత్రమే లివ్‌లు వర్తింపు అనే నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది. మెటర్నిటీ లివ్‌లను 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుకోగా.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. Also…
మహిళలు అన్ని రంగాల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా మహిళల సహకారం కనిపిస్తుంది. అయితే.. దేశంలో ఒక మహిళ ప్రారంభించిన బ్యాంకు ఉంది. అది కేవలం మహిళలచే నిర్వహించబడుతుంది. ఈ బ్యాంకు మహిళల అభ్యున్నతి కోసం, బ్యాంకింగ్ రంగానికి అనుసంధానం చేయడం కోసం ప్రారంభించారు. ఈ బ్యాంక్ 1998లో స్థాపించారు.. ఆ తర్వాత సంవత్సరం RBI నుండి లైసెన్స్ పొందింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
Taliban Government Gives Shock To Women Officials: గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళల హక్కుల్ని కాలరాస్తూ వస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. పురుషాధిక్య విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. మహిళా ఉద్యోగులపై కొరడా ఝుళపించారు. వారిని ఆఫీసుకు రావొద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా బంధువుల్లోని మగాళ్లని పంపాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది.…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో…
తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఈ మేరకు రేపు సెలవు ప్రకటిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంబరాలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన…
దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డ్ సాధించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ ప్రకటించిన టాప్ 500 కంపెనీల్లో టాటా కన్సల్టెన్నీ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,78,357 మంది ఉన్నారు. మొత్తం టీసీఎస్ ఉద్యోగుల్లో 35 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. Read: ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ క్లారిటీ… పదేళ్ల కిందట…
ఏపీ ఎస్.ఎస్.సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సెక్సువల్ గా వేధిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు మహిళ ఉద్యోగులు. గట్టిగా మాట్లాడితే సస్పెండ్స్ చేస్తున్నారంటూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన ఓ సూపరిండెంట్ పై చేయి చేసుకుని, సస్పెండ్ చేసారు సుబ్బారెడ్డి. ఎస్.ఎస్.సీ బోర్డ్ పరువు కాపాడాలి… మహిళలను రక్షించాలి అంటూ నిరసన చేస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మహిళ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారని.. అలాగే అబ్బాయిలు వుండే…