‘తలైవి’ హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘తలైవి’. పురచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జూన్ 22న పూర్తయ్యాయి.

తాజాగా హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తయింది. తమిళంలో ఇచ్చినట్టుగానే హిందీ వర్షెన్ కూ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. టోటల్ మూవీ రన్ టైమ్ 2 గంటల 33 నిమిషాల 17 సెకన్లు అని తెలుస్తోంది. ఎంజీఆర్ గా అరవింద స్వామి నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ను నిర్మాతలు ముమ్మరం చేశారు. చెన్నయ్ తో పాటు ఇటు హైదరాబాద్, అటు ముంబైలోనూ ప్రమోషనల్ యాక్టివిటీస్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ అయిన విషయాన్ని స్వయంగా కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సినీ, రాజకీయ రంగాలలో దిగ్గజ సమానురాలైన జయలలిత బయోపిక్ ‘తలైవి’ని వెండితెర మీద మాత్రమే చూడాలని ఈ సందర్భంగా కంగనా రనౌత్ పేర్కొంది.

Related Articles

Latest Articles

-Advertisement-