ఐరాసాను టార్గెట్ చేసిన‌ నార్త్ కొరియా… ఎందుకంటే…

అంద‌రిదీ ఒక‌దారైతే, ఉత్త‌ర కొరియా దేశానిది మ‌రోక దారి.   త‌మ‌ను విమ‌ర్శించిన వారికి వార్నింగ్‌లు ఇవ్వ‌డం అన్న‌ది వారికి కామ‌న్.  ద‌క్షిణ కొరియా, అమెరికాపై ఒంటికాలిపై విరుచుకుప‌డే ఉత్త‌ర కొరియా ఇప్పుడు ఏకంగా ఐరాసాను టార్గెట్ చేసింది.  ఐరాసాపై విరుచుకుప‌డింది.  ఇటీవ‌లే నార్త్ కొరియా దేశం ఓ క్షిప‌ణిని ప్ర‌యోగించింది.  సూప‌ర్ సోనిక్ క్షిప‌ణీ వ్య‌వ‌స్థను సొంతం చేసుకోవ‌డంతో వివిధ దేశాలు ఆందోళ‌న చేస్తున్నాయి.  నార్త్ కొరియాతో ఎప్ప‌టికైనా డేంజ‌ర్ అని, వీలైనంత వ‌ర‌కు ఆ దేశాన్ని కంట్రోల్‌లో ఉంచాల‌ని చెబుతున్నాయి.  సూప‌ర్ సోనిక్ క్షిప‌ణి ప్ర‌యోగం త‌రువాత ఐరాస‌లోని భ‌ద్ర‌తా మండ‌లి ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసింది.  ఈ స‌మావేశంలో నార్త్ కొరియా క్షిప‌ణి వ్య‌వ‌స్థ గురించే చ‌ర్చించారు.  దీనిపై నార్త్ కొరియా స్పందించింది.  త‌మ‌లాంటి దేశాలు ఇలాంటి క్షిప‌ణీ వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ది చేసుకుంటే ఆంక్ష‌లు విధిస్తార‌ని, కానీ, అమెరికా ఇలాంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే చూస్తూ ఊరుకుంటార‌ని, త‌మ సార్వ‌భౌమ‌త్వానికి ఇబ్బందులు క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది కాద‌ని నార్త్ కొరియా పేర్కొన్న‌ది.  

Read: సైంటిస్టుల‌కు తెలివికి ప‌రీక్ష పెడుతున్న చెట్లు… ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కార‌ణం తెలియ‌దు…

-Advertisement-ఐరాసాను టార్గెట్ చేసిన‌ నార్త్ కొరియా... ఎందుకంటే...

Related Articles

Latest Articles