ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఇవాళ ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Farmers Protest: పంటకలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బారికేట్లు, ముళ్ల కంచెలను దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న రైతులు, ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. డ్రోన్ల సాయంతో వీటిని ఆందోళనకారులపై పడేస్తున్నారు.
Rahul Gandhi: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టం, ఇతర డిమాండ్లలో 200 రైతు సంఘాలు ఢిల్లీ ఛలో మార్చ్‌కి పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ-హర్యానా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ట్రాక్టర్లతో వచ్చిన రైతుల్ని పోలీసులు, కేంద్రబలాగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ల పథకాన్ని…
ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్‌గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని…
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇంకా దేశంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్రమంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తరువాత జరిగిన సంఘటనలో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర…
ఉత్తర ప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. లఖీంపూర్ ఖేరీ లో నిరసనలు చేపడుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారని, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారని ఆరోపణలు. దీంతో కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, లఖీంఫూర్ ఘటన…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…