Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Tdp Leader Atchannaidu

పదవి పోవడంతో ఆ నాయకుడు డీలా పడ్డాడా…?

Published Date :July 17, 2021 , 11:07 am
By Manohar
పదవి పోవడంతో ఆ నాయకుడు డీలా పడ్డాడా…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్‌ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్‌ ప్లీజ్‌ అంటున్నారట. మన టైమ్‌ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు?

అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా?

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా కనిపించిన అచ్చెన్నలో.. ESI కేసులో జైలుకెళ్లిన తర్వాత ఎంతో మార్పు వచ్చిందట. వరసగా రాజకీయంగా తగిలిన దెబ్బలు వేడి తగ్గించాయో.. లేక దూకుడికి బ్రేక్‌లు వేశాయో కానీ.. ఆయనలో మునుపటి ఉత్సాహం లేదన్నది టీడీపీ వర్గాల్లో వినిపించే మాట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత కూడా అచ్చెన్న మార్కు పాలిటిక్స్‌ కనిపించడం లేదన్నది కేడర్‌ వాదన.

రెండేళ్ల తర్వాత టెక్కలిలో టీడీపీ కేడర్‌తో అచ్చెన్న భేటీ!
అచ్చెన్నకు బాధలు చెప్పుకొన్న కేడర్‌

ఉన్నట్టుండి ఈ మధ్య అచ్చెన్నాయుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్‌ నిరాశలో ఉన్న కేడర్‌లో జోష్‌ తీసుకొచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల తర్వాత టెక్కలి టీడీపీ ఆఫీస్‌లో ఆయన తొలిసారి మీటింగ్‌ పెట్టారు. పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా సమావేశానికి వచ్చాయి. గతంలో పనులు చేసి బిల్లులు రాక అప్పులైపోయిన వాళ్లు.. రెండేళ్లుగా రాజకీయంగా ఇబ్బంది పడుతున్నవారు.. పార్టీ ముఖ్యనేతలు జెండా ఎత్తేయడంతో దిశానిర్ధేశం చేసేవారు లేక ఆందోళన చెందుతున్న కేడర్‌ ఇలా అందరూ అచ్చెన్న ముందు వాలిపోయారు. ఒకరి వెనక ఒకరుగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

కేడర్‌ను ఆశ్చర్య పరిచిన అచ్చెన్న సమాధానం!

వైసీపీ కార్యకర్త దగ్గర్నుంచి వాలంటీర్ వరకూ తమను ఎలా ఇబ్బంది పెడుతున్నదీ.. అచ్చెన్నకు చెప్పుకొని బోరుమన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విధంగా పరిస్థితులు ఉంటే పార్టీ మనుగడ కష్టమని విలపించారట. తమ బాధలకు అచ్చెన్నాయుడు ఓదార్పు ఇస్తారని అంతా ఆశించారు. కానీ.. తమ నాయకుడు చెప్పిన మాటలు విని విస్తుపోయారట. అనవసరంగా ఎవరూ కేసుల్లో ఇరుక్కోవద్దు. గ్రామాల్లో గొడవల్లో తలదూర్చొద్దు. కొద్దిగా సంయమనం పాటించాలి అని ప్రవచనాలు ఇచ్చారట ఏపీ టీడీపీ చీఫ్‌.

ఈ రెండున్నరేళ్లూ ఆవేశపడొద్దని కేడర్‌కు హితోక్తులు

అక్రమ కేసుల్లో ఇరికిస్తే న్యాయపరంగా పోరాడదాం తప్ప మొండిగా వెళ్లొద్దని కేడర్‌కు గట్టిగానే హితవు పలికారట అచ్చెన్నాయుడు. త్వరలోనే మండల పార్టీల నాయకత్వాలను మార్చి పార్టీకి కొత్తనీరు పోస్తానని హామీ ఇచ్చారట. కాకపోతే ఎవరూ ఈ రెండున్నరేళ్లు ఆవేశపడొద్దు.. ఇప్పుడు టైమ్ బాలేదు.. మనకు కూడా సమయం రావాలి అని వేదాంత ధోరణిలో మాట్లాడారట. ఈసారి వచ్చేది మనప్రభుత్వమే అన్ని లెక్కలూ అప్పుడే తేల్చుకుందాం.. సమయం కోసం ఎదురుచూడాలని క్యాడర్‌కు హితబోధ చేశారట.

అనుభవం కొత్త పాఠాలు నేర్పిందా?

నిన్నమొన్నటి వరకూ దూకుడుగా మాట్లాడుతూ , అధికారపక్షంపై ఒంటి కాలిపై లేచే ఆ అచ్చెన్న.. ఈ అచ్చెన్నా ఒకరేనా అని క్యాడర్ ఆశ్చర్యపోయిందట. కేసులు …అరెస్టులు ఎదుర్కొన్న అనుభవంతో తమ మంచికోసమే అచ్చెన్నాయుడు ఇలా సూచించి ఉంటారని మరికొందరు సరిపెట్టుకున్నారట. మొత్తానికి శాంతంగా.. ఓదార్పుతో ఎర్రన్న సోదరుడు మాట్లాడిన తీరు పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • atchannaidu
  • tdp
  • TDP Leader

తాజావార్తలు

  • Deepika Padukone: భర్త సినిమా “ధురందర్-2″పై దీపికా ఫస్ట్ రియాక్షన్‌.. తన మౌనంపై క్లారిటీ ఇచ్చేసిందిగా..

  • Udhayanidhi Stalin New Controversy: మరో వివాదంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ …

  • Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions