రసవత్తరంగా ఆమదాలవలస రాజకీయం.. తమ్మినేని తనయుడు వర్సెస్ కూన రవి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకల్ ఫైట్ సమయంలో హీటెక్కిన అక్కడి రాజకీయం చల్లారలేదు. ఇంతలో తండ్రికి తనయుడు కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ప్రత్యర్థిని కార్నర్ చేస్తున్నారు. ప్రత్యర్థి కూడా తక్కువేమీ కాదు. ఒకే బ్లడ్. ఒకే కుటుంబం. ఏదైనా అంటే సర్రున లేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ?
మొన్నటి వరకు తమ్మినేని వర్సెస్ కూన
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు ఏం మాట్లాడినా కౌంటర్ ఎటాక్‌కు దిగిపోయే స్పీకర్ తమ్మినేని సీతారాం రూటు మార్చేశారట. పంచాయతీ ఎన్నికలకు ముందు వరకు లోకల్ పాలిటిక్స్ తమ్మినేని సీతారాం వర్సెస్ కూన రవికుమార్ అన్నట్టు ఉండేది. అలాంటిది తమ్మినేని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మేనల్లుడు, టీడీపీ నేత రవికుమార్ మాత్రం పంథాను మార్చుకోలేదు. అవకాశం చిక్కితే మామను కార్నర్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గానికి తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారో ఏమో.. కూనపైకి తన కూనను ఉసిగొల్పుతున్నారట తమ్మినేని.
read more : 2023లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం : ఈటల
ఇప్పుడు కూన వర్సెస్ తమ్మినేని తనయుడు
కూన రవిపైకి తన వారసుడైన చిరంజీవి నాగ్‌ను దించారు తమ్మినేని. స్పీకర్ రాజకీయాలు మాట్లాడొచ్చా అని విమర్శలు చేస్తున్నవారికి చెక్ పెట్టాలనే ఈ వ్యూహం ఎంచుకున్నట్టు పైకి చెబుతున్నా.. కుమారుడి భవిష్యత్‌కు ఇప్పటి నుంచే ఆయన బాట వేస్తున్నారని అనుకునేవాళ్లూ ఉన్నారు. రవి మాత్రం.. మామ.. అల్లుడు అని తేడా లేకుండా తమ్మినేనిని.. ఆయన కుమారుడిని వదిలి పెట్టడం లేదు.
పరిషత్ ఎన్నికల్లో ఇరకాటంలో పడ్డ కూన
పరిషత్ ఎన్నికల సమయంలో జరిగిన ఓ గొడవలో రవికుమార్ ఇరకాటంలో పడ్డారు. కేసులో ఇరుక్కున్నారు. ఇలా కేసుల్లో బుక్కవడం.. బెయిల్ తెచ్చుకోవడం ఆయనకు కొత్తేమీ కాకపోయినా.. దూకుడు మాత్రం తగ్గించడం లేదు. అందువల్లే పంచాయతీ ఎన్నికల నాటి నుంచి వైరిపక్షాల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడుస్తోంది.
ఆసక్తిగా మారిన ఆమదాలవలస రాజకీయం
ఇరు కుటుంబాల మధ్య నడుస్తోన్న సవాళ్లతో ఆమదాలవలసలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అప్పట్లో ఆ మామా అల్లుళ్లు…ఇప్పట్లో ఈ మామా అల్లుళ్లు అని చెవులు కొరుక్కుంటున్నారు జనం. మరి.. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..