అక్టోబర్ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని టీమ్స్.. ఈ టోర్నీ కోసం సన్నద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ 20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో బీసీసీఐ ఓ కీలక మార్పు చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అక్షర్ పటేల్ స్థానాన్ని శార్దూల్ ఠాకూర్ భర్తీ చేస్తాడని.. అతన్ని మెయిన్ టీం లోకి తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది బీసీసీఐ. తొలుత 15 మంది తో కూడిన మెయిన్ టీం లో ఉన్న అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బై ప్లేయర్ గా మారాడు. కాగా.. ఇవాళ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా.. టీమిండియా కొత్త జెర్సీ ని విడుదల చేసింది బీసీసీఐ.