Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మార్చ్ 27 రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడనుందని తెలుస్తుండగా.. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నిజానికి, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవలె డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారు.
Also Read : Balayya : దిల్ రాజు బ్యానర్ లో మలయాళ దర్శకుడితో బాలయ్య
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
త్వరలోనే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా అవుట్‌పుట్‌పై ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్టే. కానీ అధికారిక రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. దీంతో.. డేట్ ప్రకటించడంలో ఆలస్యం వెనుక రకరకాలు చర్చ జరుగుతోంది. మార్చ్ నెలలో ఇతర పెద్ద సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ సీక్వెల్ మార్చ్ 19న రిలీజ్ అవుతోంది. యశ్ ‘టాక్సిక్’ కూడా అదే రోజు విడుదలవుతోంది. ఇలాంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే ఖచ్చితమైన తేదీని ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేయడం దాదాపు ఖరారైనప్పటికీ, రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్‌గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!