రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమయ్యిందో అనే ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుంది అని కూడా తెలిపారు. కానీ కృష్ణంరాజు ఇంట్లో కాలు జారి కింద పడ్డారని, దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. మరోవైపు త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి కృష్ణంరాజు అపోలోకి వచ్చారని కేంద్ర మాజీ మంత్రి యూ.వి.కృష్ణంరాజు కార్యాలయం ప్రకటించింది. మరోవైపు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితి పై కృష్ణంరాజు చర్చించారని తెలుస్తోంది. తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారు.