సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?

ఇటీవల కాలంలో మరోసారి సమంత, నాగ చైతన్య విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశగా మారింది. అది ఇప్పటికి ఎటూ తేలకుండానే ఉంది. ఈ జంట టాలీవుడ్ జనాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా చై, సామ్ విడాకుల వార్తలు రావడం, వాటిపై సామ్ స్పందిస్తున్న తీరు అలాగే అన్పిస్తోంది. ముందుగా ఈ విషయంపై తాను స్పందించాలని అనుకోవట్లేదని చెప్పేసిన సామ్ తరువాత రూమర్స్ ఎక్కువవడంతో ఓ కుక్క ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ మీడియా చిన్న విషయాన్నీ పెద్దది చేస్తోందని చెప్పేసింది. దీంతో వాళ్ళిద్దరి విడాకుల విషయం రెండ్రోజులు సైలెంట్ అయిపొయింది.

Read Also : బన్నీ, బోయపాటి కలయికలో రెండో సినిమా

తరువాత సామ్ ఫ్రెండ్స్ తో ఒక్కతే షికార్లకు వెళ్లడం, ఆ ఫోటోలను పోస్ట్ చేయడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతేకాదు వీరిద్దరి మధ్య బంధాన్ని మెరుగుపరచడానికి కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారని అన్నారు. అయినప్పటికీ ఈ జంట విడాకుల వైపే అడుగేస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా తాజాగా విడుదలైన “లవ్ స్టోరీ” ట్రైలర్ పై సమంత ట్వీట్ చేసింది. చైతన్య ఈ ట్రైలర్ విడుదల చేస్తూ చేసిన ట్వీట్ కు రిప్లై గా నాగ చైతన్య పేరును ట్యాగ్ చేయకుండానే, సాయి పల్లవి పేరును మాత్రం పేర్కొంటూ “విన్నర్” అంటూ చిత్రబృందానికి విషెష్ చెప్పింది. దీంతో ఆ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

తాజాగా అన్ని రూమర్స్ కు చెక్ పెడుతూ నాగ చైతన్య సామ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. “థాంక్స్ సామ్” అంటూ నాగ చైతన్య ఇచ్చిన రిప్లై అక్కినేని అభిమానుల్లో ఉన్న అనుమానాలు పటాపంచలు చేసేసింది. ఈ ఒక్క ట్వీట్ తో నాగ చైతన్య, సామ్ మధ్య అందరూ అనుకుంటున్నట్టుగా ఏం లేదని వారి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-